సీపీఐ సీనియర్ నేత ధూళిపాల సీతారామచంద్రరావు మృతి చెందారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ లో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని పార్టీ నాయకుల, కార్యకర్తల మరియు బంధుమిత్రుల సందర్శనార్థం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు కొండాపూర్ వృద్ధాశ్రమంలో ఉంచుతారని తెలిపారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్ వద్ద మధ్యాహ్నం 1- నుండి నుండి 2 గంటల వరకు వారి పార్థివ దేహాన్ని ఉంచి తదనంతరం వారి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వనున్నారు.
