సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్ ఆమోదం..

సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్ ఆమోదం..

సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్ఎస్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును బుధవారం(అక్టోబర్ 22) సీఎస్ రామకృష్ణ రావు ఆమోదించారు. అక్టోబర్ 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమలులోకి వస్తుందని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 

1999 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని విద్యుత్ శాఖ కార్యదర్శిగా, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం గమనార్హం.