జనగామ అర్బన్/ కామారెడ్డి వెలుగు: సీపీఐ మావోయిస్టు అజ్ఞాత నాయకుడు, దండకారణ్య సౌత్ బస్తర్ డీవీసీ పరిధిలోని చైతన్య నాట్య మంచ్ డివిజనల్ సెక్రటరీ లోకేటి రమేశ్ అలియాస్ అశోక్ జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ ఎదుట మంగళవారం లొంగిపోయాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రమేశ్రెండు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. 2016లో ఎల్వోసీ కమాండర్ గొట్టా బొజ్జి అలియాస్ కమలను పెండ్లి చేసుకున్నాడు. ఆమె 2023లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నది. రమేశ్‌పై రూ.8 లక్షల రివార్డు ఉండగా ప్రస్తుతం రూ.25 వేలు డీసీపీ అందజేశారు. మిగిలిన డబ్బులు డీడీ ద్వారా ఇస్తామని తెలిపారు.
