వైరల్ వీడియో: ఇది కదా జెండావందనం అంటే..

V6 Velugu Posted on Jan 26, 2022

రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల దాకా, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ఇలా అందరూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వీరందరిలో ఒక వృద్దురాలు చేసిన జెండావందనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడో తెలియదు కానీ, జెండా ఎగరక ముందే అటుగా వెళ్తున్న మహిళ చేసిన జెండావందనం అందరినీ ఆకర్షిస్తోంది. జెండాను చూసిన వెంటనే.. చెప్పులు విడిచి, చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి.. జెండా గద్దె వద్దకు చేరుకుంది. కళ్లకు అద్దుకొని సెల్యూట్ చేసింది. అనంతరం చెప్పులు వేసుకొని, సంచి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను ‘ద బెటర్ ఇండియా’ ట్వీట్ చేయగా.. దానిని సినీనటి రవీనా టాండన్ రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వేలల్లో లైకులు సాధిస్తోంది.

For More News..

జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎంపీపీ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగుస్తున్న ఉచ్చు

Tagged Social media, Republic Day, Viral Video, best salute, senior women flag salute

Latest Videos

Subscribe Now

More News