వింబుల్డన్‌‌‌‌లో సంచలనం.. సబలెంకాకు షాక్‌‌‌‌.. ఫైనల్లో అనిసిమోవా వర్సెస్ స్వైటెక్‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌లో సంచలనం.. సబలెంకాకు షాక్‌‌‌‌.. ఫైనల్లో అనిసిమోవా వర్సెస్ స్వైటెక్‌‌‌‌

లండన్‌‌‌‌: వింబుల్డన్‌‌‌‌లో పెను సంచలనం నమోదైంది. ఏమాత్రం అంచనాల్లేని అమెరికా ప్లేయర్‌‌‌‌ అమండా అనిసిమోవా.. వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌, బెలారస్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అరీనా సబలెంకాకు ఊహించని షాక్‌‌‌‌ ఇచ్చింది. గురువారం (జులై 10) జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో 13వ సీడ్‌‌‌‌ అనిసిమోవా 6–4, 4–6, 6–4తో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ సబలెంకాపై గెలిచి తొలిసారి గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 

ముఖాముఖి రికార్డుల్లో అనిసిమోవా 5–3 ఆధిక్యంలో ఉన్నా.. ఈ ఏడాది రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌తో పాటు ఆడిన నాలుగు చివరి మ్యాచ్‌‌‌‌ల్లో సబలెంకానే గెలిచింది. దీంతో ఫేవరెట్‌‌‌‌గా ఈ మ్యాచ్‌‌‌‌ను మొదలుపెట్టినా అమెరికన్‌‌‌‌ దృఢ సంకల్పం, షాట్స్ సెలెక్షన్‌‌‌‌ ముందు బెలారస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ తేలిపోయింది. 2 గంటలా 37 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌లో ఈజీగా తొలి సెట్‌‌‌‌ నెగ్గిన సబలెంకా తర్వాతి రెండు సెట్లలో ఊహించని ప్రతిఘటనను ఎదుర్కొంది. 

సబలెంక కొట్టిన ప్రతీ షాట్‌‌‌‌ను దీటుగా రిటర్న్‌‌‌‌ చేసిన అనిసిమోవా కీలక టైమ్‌‌‌‌లో వరుసగా పాయింట్లు రాబట్టింది. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో అనిసిమోవా రెండు ఏస్‌‌‌‌లు, ఐదు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. 11 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో నాలుగింటిని కాచుకుంది. ఇక ఆరు ఏస్‌‌‌‌లు కొట్టిన సబలెంక నాలుగు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. 14 బ్రేక్‌‌‌‌ పాయింట్లు లభించగా, మూడింటినే సద్వినియోగం చేసుకుంది. 

మరో సెమీస్‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌ (పోలాండ్‌‌‌‌) 6–2, 6–0తో బెలిండా బెన్సిచ్‌‌‌‌ (స్విట్జర్లాండ్‌‌‌‌)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. గంటా 12 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో తొలి సెట్‌‌‌‌లో మాత్రమే బెన్సిచ్‌‌‌‌ కొద్దిగా పోటీ ఇచ్చింది. రెండో సెట్‌‌‌‌ మొత్తం స్వైటెక్‌‌‌‌ హవానే కొనసాగింది.