శాసనమండలిలో గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు

శాసనమండలిలో  గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసనమండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు భూ స్వాములకు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. 50, 200  ఎకరాలున్న వారికి కూడా రైతు బంధువస్తుందన్న వెంకన్న ..  కాంగ్రెస్ ప్రభుత్వమైనా 10 ఎకరాల లోపు ఉన్నవారికి రైతు బంధు ఇవ్వాలని కోరారు.  వందల ఎకరాలు ఉన్న వాళ్లకు హీరోలకు, హీరోయిన్లకు, ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు రైతు బంధు వద్దని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెపుతున్నా అని అన్నారు.  

గత ప్రభుత్వం ప్రొఫెసర్లను , మేధావులను , ఐఏఎస్ లను అరెస్ట్ చేసిందన్నారు.  హరగోపాల్ లాంటి వారి మీద కూడా   ఉపా  కేసు పెట్టడం తప్పు అని చెప్పారు.  అంతేకాకుండా గత ప్రభుత్వం కుల సంఘాలకు భవనలంటూ కులతత్వాన్ని ప్రోత్సహించిందని గోరటి వెంకన్న ఆరోపించారు. 

 కేసీఆర్ లాంటి తత్వవేత్తకు ఎవరి ఇలాంటి సలహాలు ఇచ్చారో తెలియదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలుకావడానికి అధికారులే కారణమని ఆరోపించారు. అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించారని చెప్పారు.  ప్రస్తుతం గోరటి వెంకన్న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.