జేసీబీతో ATMను కొల్లగొట్టారు : మైండ్ బ్లాక్ చేసే దోపిడీ

జేసీబీతో ATMను కొల్లగొట్టారు : మైండ్ బ్లాక్ చేసే దోపిడీ

నార్తర్న్ ఐర్లాండ్ లో ఘరానా రాబరీ జరిగింది. ఇలాంటి దోపిడీ మీరెప్పుడూ చూసి ఉండరు. కనీసం విని కూడా ఉండరు. గ్యారంటీగా చెబుతున్నాం. మీరు కనుక ఈ వీడియో చూస్తే… మీ కళ్లను మీరే నమ్మలేరు. దొంగతనాలు ఇలాకూడా చేస్తారా అని షాకవుతారు.

అది డుంగివెన్ నగరం. సమయం తెల్లవారుజామున 4 గంటలు. నాలుగే నిమిషాలు… 4 అంటే 4 నిమిషాల్లోనే ఈ భారీ రాబరీ చేసేశారు దుండగులు. వచ్చింది ఇద్దరే. ఇద్దరి  ముఖాలకు మాస్కులున్నాయి. ఒకడేమో కార్లో వచ్చాడు.. ఇంకొకడు జేసీబీ నడుపుకుంటూ వచ్చాడు. కార్లో ఉన్నవాడు దిగిపోయాడు. జేసీబీ వచ్చీరాగానే.. అక్కడ కార్నర్ లో ఉన్న ఏటీఎం రూమ్ ను పైనుంచి పగలకొట్టాడు. అందులో ఉన్న ఏటీఎం మెషీన్ ను బయటకు తీశాడు. జేసీబీ హ్యాండ్ సాయంతో… దాన్ని లేపి… తాము వచ్చిన వాహనంలో వేశాడు. అంతే.. ఆ తర్వాత ఆ జేసీబీని అక్కడే వదిలేసి… కార్లో ATM మెషీన్ తో పారిపోయారు.

తెల్లవారేసరికి అక్కడ ఏటీఎం లేదు. ఏటీఎం రూమ్ అంతా ధ్వంసం అయి ఉంది. బ్యాంక్ వారి సమాచారంతో పోలీసులు కేస్ టేకప్ చేశారు. సీసీ ఫుటేజ్ చూశారు. అది చూశాక వారికి కళ్లు బైర్లు కమ్మినంత పనైందట. వీళ్లు మామూలు దొంగలు కాదంటున్నారు ఐర్లండ్ పోలీసులు. వాళ్లు తెచ్చిన వాహనాలు కూడా వారివి కావని నిర్ధారించారు. అందుకే జేసీబీని అక్కడే వదిలివెళ్లారు దుండగులు. కారును పైభాగాన్ని కట్ చేసి.. అందులో ఏటీఎం మెషీన్ ను పెట్టి.. అదే వాహనంలో ఉడాయించారు.

ఏటీఎంలోని డబ్బు తీసుకెళ్లాలంటే అది అంత ఈజీ కాదని.. అందుకే.. నిమిషాల్లోనే దోపిడీ పూర్తైపోవాలనే ఉద్దేశంతో జేసీబీ తెచ్చారని పోలీసులు అంటున్నారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.