ఇంట్రాడేలో సెన్సెక్స్@75,000

ఇంట్రాడేలో సెన్సెక్స్@75,000

ముంబై: బెంచ్‌‌‌‌మార్క్ ఈక్విటీ సూచీలు మంగళవారం కొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్ ఇంట్రా-డేలో మొదటిసారిగా చారిత్రాత్మక 75,000 మార్క్‌‌‌‌ను అధిగమించింది. సెషన్‌‌‌‌ను ముగించే ముందు అధిక స్థాయిలలో ప్రాఫిట్ బుకింగ్‌‌‌‌తో తగ్గింది. చివరికి 58.80 పాయింట్లు క్షీణించి 74,683.70 వద్ద స్థిరపడింది.  ఇంట్రాడేలో 381.78 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 75,124.28కి చేరుకుంది. 

ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 23.55 పాయింట్లు తగ్గి 22,642.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 102.1 పాయింట్లు పెరిగి రికార్డు గరిష్ట స్థాయి 22,768.40కి చేరుకుంది. సెన్సెక్స్‌‌‌‌ నుంచి టైటాన్‌‌‌‌, రిలయన్స్‌‌‌‌  , ఏషియన్‌‌‌‌ పెయింట్స్‌‌‌‌, టెక్‌‌‌‌ మహీంద్రా, ఇండస్‌‌‌‌ఇండ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, అల్ట్రాటెక్‌‌‌‌ సిమెంట్‌‌‌‌, విప్రో, ఐటీసీలు వెనుకబడి ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.  ఆసియా మార్కెట్లలో, టోక్యో, షాంఘై  హాంకాంగ్ సానుకూలంగా స్థిరపడగా, సియోల్ దిగువన ముగిసింది. యూరప్​ మార్కెట్లు చాలా వరకు నెగటివ్​లో ట్రేడవుతున్నాయి.