బుల్ జోరు.. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు 

బుల్ జోరు.. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు 

ముంబై: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై అనుకూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాల మధ్య సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. 1,400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా.. 400 పాయింట్లకు పైగా లాభంలో నిప్టీ ట్రేడవుతుంది. సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత మళ్లీ 60 వేల మైలురాయిని దాటింది. గత వారం ఎఫ్ఐఐలల కొనుగోళ్లు తిరిగి ప్రారంభమవ్వడం మార్కెట్లకు కలిసొచ్చింది. గతనెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడంతో ఇన్వెస్టర్లు కొనగోళ్లకు మొగ్గు చూపారు. రష్యాతో చమురు కొనుగోళ్ల ఒప్పొందాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ట్రెండ్‌ బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 75.78 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, మారుతీ, పవర్ గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం:

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

సెలవు రోజుల్లో వీఐపీ దర్శనాలు ఉండవ్

రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీల లెక్క కొలిక్కి