సెన్సెక్స్ 941 పాయింట్లు జంప్..​ 22,600 పైన ముగిసిన నిఫ్టీ

సెన్సెక్స్ 941 పాయింట్లు జంప్..​ 22,600 పైన ముగిసిన నిఫ్టీ
  •      బ్యాంక్ స్టాక్స్​లో భారీ కొనుగోళ్లు 
  •      సానుకూలంగా గ్లోబల్ ట్రెండ్స్​

ముంబై: స్టాక్​ మార్కెట్లు సోమవారం అదరగొట్టాయి.  బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బీఎస్​ఈ సెన్సెక్స్ 941 పాయింట్లు పుంజుకోగా, బ్యాంకింగ్  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా షేర్లలో కొనుగోళ్లు,  గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 22,600 స్థాయికి ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 941.12 పాయింట్లు పెరిగి 74,671.28 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లోని 26 షేర్లు లాభాల్లో ముగియగా, నాలుగు మాత్రమే నష్టపోయాయి. ఇంట్రాడేలో 990.99 పాయింట్లు (1.34 శాతం) జూమ్ చేసి 74,721.15 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 223.45 పాయింట్లు పెరిగి 22,643.40 వద్ద ముగిసింది.

దీంట్లోని 32 షేర్లు లాభాల్లో, 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మార్చి త్రైమాసికంలో నికర లాభంలో 18.5 శాతం వృద్ధి సాధించి రూ. 11,672 కోట్లకు చేరుకోవడంతో ఈ షేర్​ దాదాపు 5 శాతం పెరిగింది. 2023–-24 చివరి త్రైమాసికంలో నికరలాభం 36 శాతం జంప్ చేయడంతో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్​ 2.7 శాతం పెరిగింది. సెన్సెక్స్​ ప్యాక్​లో ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లాభపడ్డాయి. మార్చి త్రైమాసికం ఫలితాలు మెప్పించకపోవడంతో హెచ్​సీఎల్​  టెక్నాలజీస్ దాదాపు 6 శాతం పడిపోయింది. ఐటీసీ, విప్రో,  బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్ కూడా నష్టపోయాయి.  

వెనకబడ్డ రియల్టీ, సర్వీసెస్ ​ఇండెక్స్​లు

బ్రాడ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో, బీఎస్​ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.79 శాతం  స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగింది. ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో బ్యాంకెక్స్ 2.70 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.81 శాతం, యుటిలిటీస్ 1.12 శాతం, పవర్ 0.90 శాతం, ఎనర్జీ 0.79 శాతం చొప్పున ఎగిశాయి. రియల్టీ, సర్వీసులు వెనకబడ్డాయి. మొత్తం 2,015 స్టాక్‌‌‌‌‌‌‌‌లు పురోగమించగా, 1,894 క్షీణించగా, 179 మారలేదు. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్ సానుకూలంగా ముగిశాయి.

యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 0.51 శాతం క్షీణించి 89.04 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు) శుక్రవారం రూ. 3,408.88 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌‌‌‌‌‌‌‌లోడ్ చేశారు. బీఎస్​ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 609.28 పాయింట్లు తగ్గి 73,730.16 వద్ద స్థిరపడింది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 150.40 పాయింట్లు పడి 22,419.95 వద్దకు  చేరుకుంది.