సెన్సెక్స్ 275 పాయింట్లు అప్

సెన్సెక్స్ 275 పాయింట్లు అప్

ముంబై : మెటల్,  బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు, యూఎస్​మార్కెట్లో  బుల్లిష్ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ కారణంగా బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ స్టాక్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ మంగళవారం పుంజుకున్నాయి.  బీఎస్ఈ సెన్సెక్స్ 275.62 పాయింట్లు పెరిగి 65,930.77 వద్ద స్థిరపడింది. దీనిలోని 18 కంపెనీలు లాభపడగా, 12 కంపెనీలు నష్టపోయాయి. ఇంట్రాడేలో ఇది 427.21 పాయింట్లు పెరిగి 66,082.36 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 89.40 పాయింట్లు పెరిగి 19,783.40 వద్దకు చేరుకుంది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో 30 షేర్లు లాభపడగా, 20 నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ షేర్లలో జేఎస్​డబ్ల్యూ స్టీల్ 1.76 శాతం పెరిగి లీడ్ గెయినర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. టాటా స్టీల్ 1.45 శాతం, టైటాన్ 1.44 శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.24 శాతం దూసుకెళ్లింది. బ్యాంకింగ్ షేర్లలో హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, టాటా మోటార్స్  బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్ కూడా ముందుకు వెళ్లాయి.

 ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ, టెక్ మహీంద్రా, మారుతీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  లార్సెన్ అండ్ టూబ్రో వెనుకబడి ఉన్నాయి. బ్రాడ్​మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బీఎస్ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.20 శాతం,  మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం లాభపడింది. ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.34 శాతం, కమోడిటీస్ 0.77 శాతం, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ 0.59 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.37 శాతం పెరిగాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, ఇండస్ట్రియల్స్, ఐటీ, టెలికమ్యూనికేషన్,  ఆయిల్, గ్యాస్ వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్ లాభాలతో స్థిరపడగా, టోక్యో, షాంఘై  హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

బాండ్ రాబడులు తగ్గడంతోపాటు డాలర్ బలహీనపడటంతో సోమవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 0.61 శాతం క్షీణించి 81.82 డాలర్లకు చేరుకుంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు సోమవారం రూ. 645.72 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. సెన్సెక్స్​ సోమవారం 139.58 పాయింట్లు నష్టపోయి 65,655.15 వద్ద ముగిసింది.