సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం.. గర్భిణీలు..12 రాశుల వారు పాటించాల్సిన నియమాలు ఇవే..!

సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం..  గర్భిణీలు..12 రాశుల వారు పాటించాల్సిన నియమాలు ఇవే..!

ఖగోళ శాస్త్రవేత్తలు... పండితులు.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్​ 7 వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  ఈ సయమంలో గ్రహణ దోష నివారణ పూజలు.. జపాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  చంద్రగ్రహణ దోషనివారణ నియమ నిబంధనల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

 ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం  ...   సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు  చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు. 

జ్యోతిష్య నిపుణులు తెలిపిన ప్రకారం   సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది.  సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు  దగ్గర గాని, కేతువు దగ్గర గాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తిగా చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు. 

సెప్టెంబర్​ 7న పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజున రాత్రి 9:58కి మొదలై  సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు  చంద్రగ్రహణం ఉంటుంది.  శతభిషం , పూర్వాభాద్ర నక్షత్రాలలో...  కుంభ రాశిలో  కుంభ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము ఏర్పడనుంది.  గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ...  మొత్తం గ్రహణ సమయం 3 గంటల 30 నిమిషాలు.  .

సెప్టెంబర్​7 న ఏర్పడే చంద్ర  గ్రహణం కుంభ రాశిలో.. పూర్వాబాధ్ర.. శతభిషం  నక్షత్రాలలో  ఏర్పడుతుంది. కావున   కుంభరాశి.. కర్కాటక రాశికి చెందిన  వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  అందువలన  ఈ రెండు రాశుల వారు  ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితిలో చూడకూడదు.  చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.  అన్ని రాశుల వారు నియమాలను పాటిస్తే  మంచిదని చెబుతున్నారు.  

చంద్రగ్రహణ నిబంధనలు 

  • ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిణి  స్త్రీలు  చూడ కూడదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతుడిని  ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది. రాత్రి సమయంలో ఏర్పడుతుంది కావున ప్రశాంతంగా నిద్రపోండి
  • గర్భిణి లు కదలకుండా పడుకోవాలి. .
  • గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు.
  • ప్రతి ఒక్కరు  గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి.
  •  ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.
  • గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.
  • గ్రహణానికి ముందు తయారు చేసిన  అన్నం కూరలు  తినుటకు పనికి రావు.
  •  గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహర పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా క్రమేణ  శరీరానికి హాని కలిగిస్తాయని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి.   శారీరక శక్తి, నమ్మకాలు  ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్థాయిలో ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.