
నవ్య స్వామితో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చాడు నటుడు రవి కృష్ణ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న వేల.. నవ్య తనకు మంచి స్నేహితురాలని చెప్పి కుండ బద్దలు కొట్టాడు రవి కృష్ణ. ఈ విషయం గురించి వివరించిన రవికృష్ణ.. "సినిమాల్లోకి రాకముందు నవ్య స్వామితో కలిసి ఒక సీరియల్ చేశానని, తనకు, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది, దాంతో గాసిప్‌లు మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు.
ఇక ఆఫ్ స్క్రీన్ రిలేషన్ పై రూమర్స్ రావడం సహజమే కానీ.. నిజానికి ఆమె నాకు మంచి స్నేహితురాలు. మేం డేటింగ్ లో లేము” అని రవికృష్ణ స్పష్టం చేశారు. ఇక రవికృష్ణ చేసిన లేటెస్ట్ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లిచేసుకుంటారని సంతోషించిన ఫ్యాన్స్ కు పెద్ద షాకే తగిలింది. మరి ఇప్పట్నుంచైనా ఆడియన్స్ వారిద్దరినీ స్నేహితుల్లా చూస్తారా? లేక రవికృష్ణ మాటల్ని పక్కన పెడతారా అన్నది చూడాలి మరి.
సినిమాలు విషయానికి వస్తే.. రవికృష్ణ సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'లో ఓ కీ రోల్ చేశాడు. నవ్య స్వామి..రీసెంట్ గా బుట్ట బొమ్మ రావణాసుర మూవీస్ లో నటించింది.