
గచ్చిబౌలి : దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ సెగ్మెంట్ అయిన శేరిలింగంపల్లిలో పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేసి సూచనలు చేశారు. ఈసారి ఎన్నికల్లో శేరిలింగంపల్లి సెగ్మెంట్ లో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు.
మొత్తం 7 లక్షల 32 వేల 506 మంది ఓటర్లున్నారని.. ఇందులో 3 లక్షల 88 వేల 482 మంది పురుషులు, 3 లక్షల 43 వేల 875 మంది మహిళలు, ఇతరులు149 మంది ఉన్నారని ఆయన తెలిపారు. సెగ్మెంట్ లో మొత్తం 638 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని 4,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. డోర్ టు డోర్ పికప్ కోసం 138 ఆటోలను సిద్ధం చేసినట్లు ఆర్వో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.