జీతాలు రాక 4 వేల మంది సెర్ప్ ఉద్యోగుల ఇబ్బందులు

జీతాలు రాక 4 వేల మంది సెర్ప్ ఉద్యోగుల ఇబ్బందులు
  • 4 వేల మంది ఉద్యోగుల ఎదురుచూపు 
  • ప్రతి నెల 15వ తేదీ దాటినా జీతాలు వస్తలేవని ఆవేదన
  • మునుగోడులో ఇచ్చిన రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీని నిలబెట్టుకోవాలని వినతి

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు. జీతాలు రాకపోవడంతో దాదాపు 4 వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 15 దాటినా జీతాలు రావడం లేదని, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఈఎంఐలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కిందటి వరకు అడ్వాన్స్ అండ్ అడ్జెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టం ప్రకారం ప్రతి నెల 5లోపు జీతం పడేదని, ఇప్పుడు ఈ సిస్టం లేదన్నారు. దసరా, సంక్రాంతి, దీపావళి పండుగలప్పుడు కూడా 15వ తేదీ దాటినా జీతాలు ఇవ్వడం లేదంటున్నారు. జీతా లు ఎందుకు రాలేదని అధికారులను అడిగితే, ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిల్లులు క్లియర్ కాలేదని చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని జీతాలు చెల్లించాలని కోరారు. జీతాల ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసినా అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడేసరికి మరో 3 రోజులు టైమ్ పడుతుందన్నారు. 4 వేల మంది ఉద్యోగుల జీతాలకు రూ.14 కోట్లు అవసరం అవుతాయని అంటున్నారు. 

రెగ్యులర్ సీఈవో లేకనే ఇబ్బందులు..

సెర్ప్ సీఈవోగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వ్యవహరిస్తున్నారు. ఈయన టూరిజం, యూత్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు. సెర్ప్ లో డైరెక్టర్లు ఉన్నా నిర్ణయాలన్నీ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియానే తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. సీఈవో నేరుగా ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులతో మాట్లాడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆయన ఇతర శాఖల వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతోనే సెర్ప్ ను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు అంటున్నారు. రెగ్యులర్ సీఈవో ఉంటే త్వరగా నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంటుందని, జీతాలు కూడా ఆలస్యంకావని చెబుతున్నారు. కాగా, ఇటీవల జరిగిన మునుగోడు బై పోల్ ప్రచారంలో సెర్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మంత్రి దయాకర్ రావు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు బై పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోయిందని తమను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.