వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

తమ కంపెనీ వ్యాక్సిన్ వల్లే ఆరోగ్యం చెడిపోయిందని.. రూ. 5 కోట్ల నష్టపరిహారం కోరిన వ్యక్తిపై సీరమ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. సీరమ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా తయారుచేస్తున్న కోవిషీల్డ్‌‌‌‌ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నదని.. అందుకే ఎస్ఐఐ తనకు రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఓ వ్యక్తి లీగల్ నోటీసులు ఇచ్చాడు. అంతేకాకుండా డ్రగ్‌‌‌‌ రెగ్యులేటరీ అథారిటీకి కూడా లీగల్‌‌‌‌ నోటీసులు ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి తమ కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని.. పరువు నష్టం కింద రూ. 100 కోట్లు చెల్లించాలని సీరమ్ కంపెనీ తిరిగి ఆ వ్యక్తిపై పరువునష్టం దావా వేసింది.

‘తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కోవిషీల్డ్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మానసిక సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితికి, తమ వ్యాక్సిన్‌కి ఎటువంటి సంబంధం లేదు. వాలంటీర్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశాం. సోమవారం అతనికి నోటీసులు అందుతాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవి. డబ్బుకోసం ఆ వాలంటీర్ ఇలా చేస్తున్నాడు’అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

For More News..

కరోనా బారినపడి బీజేపీ ఎమ్మెల్యే మృతి

నీ డీజీపీ ఆఫీసుకొస్తా బిడ్డా.. గెలిచే దమ్ములేక దాడి చేస్తున్నరు

ఒక్క టెర్రరిస్టును పట్టించినందుకు 60 మంది రైతుల హతం