
సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన గౌతమ్ ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్చేస్తాడు. ఐదంకెల జీతం.. అయినా ఏదో వెలితి. సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో వృద్ధులు, వికలాంగులు, మతి స్థిమితం లేని వారికి అండగా నిలుస్తున్నారు. వందలాది అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించారు. సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. పొట్ట చేతపట్టుకొని నగరానికి వచ్చి పని దొరక్క భిక్షాటన చేసే వారికి, నా అనే వారు లేక యాతన పడే అనాథలకు ‘నేనున్నా’నంటూ ఆదుకుంటున్నారు. ‘సర్వ్ నీడీ’ పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు:2012లో తనకు వచ్చిన ఆలోచనను గుప్పెడు బియ్యంతో స్టార్ట్చేశాడు గౌతమ్. ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన బియ్యం, పప్పు, ఉప్పులతో వారానికి ఒకపూట పేదలకు అన్నదానం చేసేవారు. తర్వాత ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టేవారు. ఈ ఆలోచన నచ్చి మరో ఐదుగురు తోడయ్యారు. అలా సేవా దృక్పథం కల వారు ఒక్కొక్కరు చేరి సర్వ్‌నీడీ సంస్థను నెలకొల్పారు.
2014లో సర్వ్ నీడీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి, చెన్నై, అనంతపురం, విజయవాడ వంటి నగరాల్లో సేవలందిస్తున్నారు. ఆకలి రక్కసిని నిర్మూలించడమే తన లక్ష్యమంటున్నారు. సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా తెలిపి సేవా దృక్పథం ఉన్నవారితో వివాహాలు, బర్త్‌డేలు తదితర ఈవెంట్స్, హోటళ్లలో మిగిలిన ఫుడ్‌ను సేకరించి అనాథలకు అందిస్తున్నారు. వీరి సేవలను మెచ్చిన కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ఆ విధంగా వచ్చిన పైసలతో అభాగ్యుల ఆకలి తీర్చడంతో పాటు దుస్తులు, బెడ్‌షీట్లు పంపిణీ చేస్తున్నారు. సర్వ్‌నీడీ ఆధ్వర్యంలో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. 20 మంది పిల్లలకు చదువు చెప్పిస్తూ వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. రహదారులపై చనిపోయిన వారు, ప్రాణాలు కోల్పోయిన అనాథలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌తోపాటు ప్రతిరోజూ అన్నిచోట్ల కలిపి వెయ్యిమంది ఆకలి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సేవా కార్యక్రమాలను ఫేస్ బుక్‌లో పోస్టు చేయడంతో కొంతమంది వృద్ధులను వారి కుటుంబ సభ్యులు గుర్తించి తీసుకెళ్లారు. అలా ఇప్పటిదాకా సుమారు 20 మంది వృద్ధులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గౌతమ్ సేవలకు పలు సంస్థలు, సంఘాలు సన్మానాలు, సత్కారాలు చేశాయి.
సర్వ్ నీడీ టీమ్ పనిచేస్తుందిలా
నగరంలో ఫుడ్ వేస్టేజీని సేకరించి కావాల్సిన పేదలకు అందజేయడం. అనాథ శవాలకు అంత్యక్రియలు చేయ డం. అనాథలు, వృద్ధులు, వికలాంగు లను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా సర్వ్ నీడీ సంస్థ పనిచేస్తోంది. శుభ కార్యాలు, హోటళ్లలో మిగిలిన ఆహారం పడేయకుండా ఈ సంస్థ సేకరిస్తున్నది. దాన్ని నీట్‌గా ప్యాక్ చేసి ఆకలితో అలమ టించే వారికి అందజేస్తున్నది. ఫుట్‌పాత్ లపై పడుకునే వారికి బట్టలు, బెడ్ షీట్లు అందజేస్తోంది. కేన్సర్ బాధిత చిన్నారు లకు పుట్టిన రోజు వేడుకలు , గాయాలతో బాధపడుతున్న మూగ జీవాలకు ట్రీట్ మెంట్, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన విద్యార్థులకు ప్రోత్సాహం వంటివి చేస్తోంది.
హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్అవార్డు
మతిస్థిమితం సరిగా లేక రోడ్లపై తిరిగే వారికి జుట్టు, గడ్డం తీసి వారిని మామూలుగా మా ర్చడం. కేన్సర్‌తో బాధపడే చిన్నారుల కోరికలు తీర్చడం, హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేసి పేద లకు వైద్య సేవలు అందించడం, ఆర్థిక స్థోమ త లేని విద్యార్థులను చదివించడం, స్వచ్ఛ భారత్, మూగజీవాల సంరక్షణ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సంస్థ సేవలను గుర్తించి హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బెస్ట్ ఆర్గనైజేషన్ అవార్డు అందజేసింది.