
శంకర్ పల్లి, వెలుగు : ఓ అమ్మాయిని వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల ఫైన్ విధిస్తూ చేవెళ్ల అడిషనల్ సెషన్స్‌కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. శంకర్‌పల్లి డీఐ నాగరాజు తెలిపిన ప్రకారం.. 2019లో ఒక అమ్మాయిని వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన శ్రీరాంరెడ్డి(29) వేధించాడు. బాధిత యువతి కుటుంబసభ్యులు శంకర్‌పల్లి పీఎస్‌లో కంప్లయింట్ చేశారు.
విచారణ చేపట్టిన చేవెళ్ల అడిషనల్ సెషన్స్ కోర్టు నిందితుడికి జైలు శిక్షతో పాటు, జరిమానా విధించినట్లు తెలిపారు. కేసు విచారణలో చొరవ చూపిన ఎస్సై లక్ష్మినారాయణ, సీఐ వినాయక్ రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ రాజేంద్రనగర్ డీసీపీ, నార్సింగి ఏసీపీ అభినందించారు.