హైదరాబాద్, వెలుగు: సోలార్ ప్రొడక్టు అందించే హైదరాబాద్ కంపెనీ ట్రూజన్ సోలార్ బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. రాబోయే 3-4 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు మొదలు పెడతామని యజమాని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఫౌండర్ భవానీ సురేష్ వెల్లడించారు.
సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు సంస్థ ఆరు వేలకు పైగా రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేసిందని చెప్పారు. ఈ వేడుకలో ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన 400 మందికి పైగా ఉద్యోగులు, 30కి పైగా డీలర్లు పాల్గొన్నారు.
అత్యుత్తమ నాణ్యత, విశ్వసనీయత గల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ బ్రాండ్‌గా, దేశవ్యాప్తంగా ఎదుగుతోందని తెలిపారు. ఉత్తమ సేవా ప్రమాణాలతో వినియోగదారులకు సౌర విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ట్రూజన్ సోలార్, ఇండ్లు, వాణిజ్య పారిశ్రామిక వినియోగదారుల కోసం పూర్తిస్థాయి రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ పరిష్కారాలను అందిస్తోంది.
