ఒకేరోజు ఏడు ఇండ్లలో చోరీ.. చింతామణిపట్నంలో దొంగల బీభత్సం 

ఒకేరోజు ఏడు ఇండ్లలో చోరీ.. చింతామణిపట్నంలో దొంగల బీభత్సం 

తాండూర్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరణ్​కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతామణిపట్నంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఏడు ఇండ్లలో ఒకేరోజు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కురువ చిన్న మల్లప్ప, పెద్ద మల్లప్ప, కప్పలి లాలప్ప, గౌడి విజయమ్మ, హరిజన్ వెంకటమ్మ, డీకొండ లక్ష్మయ్య, గోవర్ధన్ రెడ్డి ఇండ్లలో దొంగతనం చేశారు.  కప్పలి లాలప్ప ఇంట్లో పట్టగొలుసులు, గోవర్ధన్ రెడ్డి ఇంట్లో రూ.4 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్​, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.