బోరెంచ జాతరలో బోనాలు

బోరెంచ జాతరలో బోనాలు

నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలోని బోరెంచ ఆలయంలో ఏడువారాల జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి పసుపు బోనం సమర్పించారు. ఓడిబియ్యం, పట్టు వస్త్రాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పురోహితులు శ్రీకాంత్ స్వామి, సిద్ధు స్వామి అమ్మవారికి మహా అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు చేశారు.