రాష్ట్రంలో పలు చోట్ల.. తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో పలు చోట్ల.. తేలికపాటి వర్షాలు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. సిటీలో చిన్న వర్షానికే పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా నందనం, జనగామ జిల్లా పడమటి కేశవాపూర్​లలో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

సిటీలోని అల్కాపురి, చార్మినార్​, బండ్లగూడతోపాటు నాగర్​కర్నూల్​ జిల్లా పాలెంలో ఒక సెంటీమీటర్​ చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్​, నిజామాబాద్​, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, వనపర్తి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ పలు చోట్ల ఒక సెంటీమీటర్​లోపే వర్షం కురిసింది.