
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా ప్రస్థానం యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తమపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ..తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిల తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకున్నారు.