పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలె..

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలె..
  • పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలె..
  • పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం

మంచిర్యాల జిల్లా:  పెంచిన ఆర్టీసి టికెట్, విద్యార్ధుల బస్ పాస్ ఛార్జీలను టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా బీజేపీ లీడర్లు. శనివారం జిల్లా నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల బస్ స్టాండ్ లో ప్రయాణికుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోని బస్ డిపో ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలన్నారు. అనంతరం డిపో మేనేజర్ కి మెమొరాండం అందించిన బీజేపీ నేతలు.. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

4కిలో మీటర్ల దూరానికి గతంలో రూ.165 ఉన్న బస్ పాస్ ఛార్జీని రూ.450కు, 8 కిలోమీటర్ల దూరానికి రూ.200 ఉన్న ఛార్జీని రూ.600కు, 12 కిలోమీటలర్ల దూరానికి రూ.245 నుంచి రూ.900లకు, 18కిలోమీటర్లు దూరానికి రూ.280 నుంచి రూ.1,150కు, 22 కిలోమీటర్ల దూరానికి రూ.330 నుంచి రూ.1350కు పెంచిందని తెలిపారు. ఈ పెంపుతో విద్యార్థులపై పెను భారం పడనుందని.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు పట్టణాలకు వస్తుంటారన్నారు. సాధారణంగా వీరు నెలవారీ బస్ పాస్ తీసుకుని ప్రయాణాలు చేస్తారు.. ఈ క్రమంలో తాజాగా పెంచిన ఛార్జీలు వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని తెలిపారు.