వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో బలపడి వాయు గుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని విపత్తుల శాఖ అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.