చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్ వరంగల్‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజలు, అటు ఆఫీస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువును తలపించేలా నీరు నిలిచినప్పటికీ మున్సిపల్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
