
ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి యూపీఎస్ హెడ్మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అదే పాఠశాలకు చెందిన టీచర్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు హెడ్మాస్టర్ రామ్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు. తనను హెచ్ఎం లైంగికంగా వేధించారని, గతంలోనే మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే తనను మరో స్కూలుకు డిప్యుటేషన్ మీద పంపారని ఆమె ఆరోపించారు. డిప్యూటేషన్ పూర్తయి వచ్చిన తర్వాత మళ్లీ తనతో హెచ్ఎం అసభ్యకరంగా ప్రవర్తించడంతో సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీచర్ని వేధించిన హెచ్ఎంకు ఎంఈవో మెమో జారీ చేశారు.