
కాగ జ్ నగర్, వెలుగు: యువతిపై లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడికి పదేండ్ల జైలుశిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి ఎంవీ రమేశ్ గురువారం తీర్పు చెప్పారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్ఐ గుంపుల విజయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కౌటాల మండలం గుండాయిపేట్ లో 2022 సెప్టెంబర్ లో యువతి(20) తన ఇంట్లోని బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన చాప్లె చందు(24) వెళ్లి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయగా నిందితుడు చందు పారిపో యాడు.ఇంటికి వచ్చిన తండ్రికి బాధిత యువతి జరిగిన విషయం తెలపగా కౌటాల పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు.
అప్పటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం చార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం సాక్షులను విచారించగా.. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జడ్జి తీర్పు చెప్పారు.