
ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోశ్
శామీర్ పేట, వెలుగు : మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్విద్యా సంస్థలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోశ్ఆరోపించారు. స్కూళ్లలోనే బుక్స్, యూనిఫాం, టై, బెల్టుల అమ్ముతున్నారని, జిల్లా విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పక్కనే ఉన్న హైదరాబాద్జిల్లా అధికారులు స్కూళ్లలో బుక్స్, యూనిఫాం, ఇతర సమాగ్రి అమ్మొద్దని సర్క్కులర్జారీ చేశారని చెప్పారు.