సమంత ఫ్యాన్స్కు సర్ప్రైజ్

సమంత ఫ్యాన్స్కు సర్ప్రైజ్

టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'శాకుంతలం'.  ఫిబ్రవరి 17వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన 'మల్లిక .. ' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు   పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. 

గుణశేఖర్ దర్శకత్వంలో దృశ్యకావ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శకుంతల పాత్రను సమంత పోషించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయం కానున్నాడు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్,అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. గుణ టీమ్ వర్క్స్ , దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.