సౌతాఫ్రికా సిరీస్లకు కుర్రాళ్లకు పిలుపు..?

సౌతాఫ్రికా సిరీస్లకు కుర్రాళ్లకు పిలుపు..?

సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ నుంచి స్టార్ ఆల్ రౌండర్లు హార్థిక్ పాండ్యా, దీపక్ హుడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా దీపక్ హుడా ఈ సిరీస్కు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు సమాచారం. ఇక హార్థిక్ పాండ్యాకు సౌతాఫ్రికా సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. 

షాబాద్ లక్కీ ఛాన్స్...
దక్షిణాఫ్రికా సిరీస్కు ఆల్ రౌండర్ పాండ్యా స్థానంలో ఆర్సీబీ ఆల్ రౌండర్ షాబాద్ అహ్మద్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. అటు కరోనా కారణంగా ఆసీస్ తో సిరీస్కు దూరమైన షమీ..ఈ సిరీస్కు దూరమవుతున్నాడు. అతని స్థానంలో ఉమేష్ యాదవ్ కొనసాగనున్నాడు. ఈ మేరకు వార్తా సంస్థ పీటీఐ కథనాన్ని ప్రచురించింది. 

షాబాద్ అహ్మద్ కెరీర్..
లెఫ్టాండర్ అయిన షాబాజ్ అహ్మద్... జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యాడు. 27ఏళ్ల షాబాజ్ బెంగాల్ తరపున దేశవాళీ మ్యాచ్‌లలో రాణించాడు. అతను లిస్ట్-A క్రికెట్‌లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు.  ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరపున 11ఇన్నింగ్స్‌లలో 27.38 సగటుతో 219పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 

పటీదార్కు పిలుపు..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఇండియా- A తరఫున  ఆడి సత్తా చాటిన ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్ మన్ రజత్ పటీదార్..సౌతాఫ్రికాతో జరిగే వన్డేల సిరీస్‌కు ఎంపికవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. అలాగే మూడు వన్డేల్లో పాల్గొననుంది. ఈ రెండు సిరీస్ లు..సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 11 వరకు జరగనున్నాయి.