
అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు షాబాద్ సీఐ, ఏఎస్ఐ. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్ లో గురువారం సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. సీఐ శంకరయ్య, ఏఎస్ఐ.. రూ. లక్ష 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా .. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లానింగ్ తో గురువారం డబ్బులు తీసుకుంటుండగా సీఐ, ఏఎస్ఐ లను పట్టుకున్నారు ఏసీబీ అదికారులు. వీరిద్దరిపై కేసు నమోదుచేసిన ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.