
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: పేదల అభ్యున్నతే కాంగ్రెస్‌ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం భిక్కనూరు మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ (భిక్కనూరు రైల్వే స్టేషన్)లో పంచాయతీ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.
జిల్లా కేంద్రంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు, ఇల్లు ఇవ్వలేదన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రాకరణ్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు భీమ్ రెడ్డి పాల్గొన్నారు.