కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. చేసే అభివృద్ధి పనులకే శాశ్వత గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి టౌన్లో అమృత్ 2 పథకంలో భాగంగా రూ.65 కోట్లతో చేపట్టనున్న వివిధ పనులకు ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ప్రజల అవసరాలు గుర్తించినప్పుడే మన పేరు చరిత్ర పుటల్లో నిలుస్తుందని పేర్కొన్నారు.
అభివృద్ధి విషయంలో తాను వివక్షతకు తావివ్వనన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పట్టణంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థను మెరుగు పర్చేందుకు 4 ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పండ్ల రాజు, అశోక్‌రెడ్డి, పున్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జి అవసరం
చదువుతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జి అవసరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విద్యార్థులకు సూచించారు. శనివారం కామారెడ్డిలోని లిటిల్ స్కాలర్ స్కూల్లోని రేడియో హౌజ్‌ను షబ్బీర్అలీ పరిశీలించారు. విద్యార్థులు నిర్వహించిన ఇంటర్వ్యూలో షబ్బీర్అలీ సమాధానాలు ఇచ్చారు.
చిన్న వయస్సులో మీడియా పరిజ్ఞానం అలవర్చుకోవటం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించటంలో ఇలాంటి రేడియో హౌజ్ కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు.
