ముస్లింలను కేసీఆర్ మోసం చేశారు: షబ్బీర్ అలీ

ముస్లింలను కేసీఆర్ మోసం చేశారు: షబ్బీర్ అలీ

హైదరాబాద్, వెలుగు: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ విమర్శించారు. ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, మైనారిటీలకు ఇండ్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం 55 ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు 6 మాత్రమే ఉన్నాయన్నారు. 

బుధవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. మైనారిటీలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. మైనారిటీ నిరుద్యోగులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెండుసార్లు అప్లికేషన్లు తీసుకున్నారని, ఒక్కరికి కూడా హెల్ప్ చేయలేదని మండిపడ్డారు. గతంలో మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందని గుర్తు చేశారు. 

త్వరలోనే మైనారిటీ, బీసీ డిక్లరేషన్లను రాహుల్, ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని వివరించారు. రూ.5 వేల కోట్లతో మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించామని చెప్పారు.