బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది : షబ్బీర్ అలీ

బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది : షబ్బీర్ అలీ

బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడాన్ని కారు పార్టీ నేతలు తప్పుపడుతున్నారని మరీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుుడు చేసిందేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గతంలో బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.  శాసనసభలో భట్టి విక్రమార్కకు శాసనమండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. 

బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వు వస్తుందని అన్నారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని అన్నారు. ఆ పార్టీ కోసం కోకాపేటలో కేటాయించిన  ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. కోకాపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొని వేలం వేయాలని ఆ డబ్బును రుణమాఫీకి ఉపయోగించాలని సూచించారు షబ్బీర్ అలీ.