నాయకుల తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యూత్

నాయకుల తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యూత్

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకుల తీరు నచ్చకపోవడంతో వివిధ జిల్లాల్లో యువత పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. షాద్ నగర్ స్థానికుడైన NSUI జాతీయ కన్వీనర్ దినేష్ తో పాటు NSUI, YOUTH కాంగ్రెస్ లో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

కాసేపట్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల తీరు నచ్చకనే.. పార్టీలో ఇమాడలేక తల్లి లాంటి కాంగ్రెస్ కు బాధతో రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు.