ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నం 

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నం 
  • హోంమంత్రి మహమూద్ అలీ
  • కొత్తూరులో జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • గిరిజన గురుకుల స్కూల్ ప్రారంభం

షాద్​నగర్, వెలుగు : ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేస్తారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. షాద్ నగర్ సెగ్మెంట్ కొత్తూరు మండలంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాలో రూ.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తూరులో రూ.5 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల స్కూల్​ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తామని నాలుగేండ్ల కిందట కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆలస్యమైనా పనులను ప్రారంభించామన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర నాయకులు మిట్టు నాయక్, జడ్పీటీసీ శ్రీలత, సర్పంచ్ అజయ్ నాయక్, వక్ఫ్​ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.