శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ తో షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో..వెనకాల వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఇదే టైంలో రెండు లారీల మధ్యలోకి కారు దూసుకురావడంతో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెండు లారీలు, కారు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రమాదంతో హైవేపై  కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.