షారుఖ్ పఠాన్ మూవీకి నిరసన సెగ.. షో రద్దు

షారుఖ్ పఠాన్ మూవీకి నిరసన సెగ.. షో రద్దు

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పఠాన్‌ మూవీకి నిరసన సెగ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీలో కాషాయ రంగును అవమానించారని.. మూవీని బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే బీహార్, అసోంలలో షోలను కూడా అడ్డుకున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని సప్నా సంగీత థియేటర్‌ ఎదుట ఓ హిందూ సంస్థ నిరసన తెలిపింది. దీంతో 9గంటల షోను రద్దు చేశారు. కాగా హిందూ సంఘాల ఆందోళనల నేపథ్యంలో పఠాన్ మూవీ రిలీజైన థియేటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మూవీకి సంబంధించి రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. దీపిక పదుకొణె హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా.. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించాడు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించగా.. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.