
నల్గొండ పట్టణ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకొడలు షాహిదా మృతిచెందింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా జిల్లా శివారులోని కేశరాజుపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో లారీని వెనకనుంచి షాహిదా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికుల చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని షాహిదా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.