షారూఖ్ మేనేజర్ పూజ జీతం.. స్టార్ హీరో రెమ్యునరేషన్ అంత!

షారూఖ్ మేనేజర్ పూజ జీతం.. స్టార్ హీరో రెమ్యునరేషన్ అంత!

పూజా దద్లానీ.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పర్సనల్ మేనేజర్. ఆయనకి సంబందించిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నీ పూజానే చూసుకుంటారు. ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె సంపాదన. అవును.. షారుఖ్ మేనేజర్ గా పూజ సంపాదన ఇప్పుడు ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల మేరకు పూజా దద్లానీ సంపద రూ.40 కోట్ల నుండి రూ. 50 కోట్ల వరకు ఉంటుందట. రూ.7 కోట్ల నుండి రూ.9 కోట్ల రూపాయల వరకు ఆమె వార్షిక ఆదాయం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు పూజ షారుఖ్ క్రికెట్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ అండ్ ఆయన హోమ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో దద్లానీ భాగం పంచుకుంటుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇలా పూజ బాగానే సంపాదిస్తుందని వార్తలు గట్టిగ వినిపిస్తన్నాయి. నిజానికి ఒక మేనేజర్ కు  రూ.9 కోట్ల వార్షిక ఆదాయం ఉందటం అనేది మామూలు విషయం కాదు. ఇండియా లెవల్లో వేరే ఏ హీరో మేనేజర్ కు కూడా ఈ రేంజ్ ఆదాయం ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పూజ ఆదాయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ALSO READ : కుక్క కరిస్తే వచ్చే వ్యాధులు ఏంటీ.. వాటి లక్షణాలు ఏంటో తెలుసుకోండి

ఇక పూజ.. షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సంబందించిన సినిమా అండ్ పర్సనల్ లైఫ్ వ్యవహారాలను కూడా చూసుకుంటారు. షారుఖ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్ ప్రమోషన్స్ లో కూడా ప్రముఖ పాత్ర పోషించాడు పూజ. ఈ నేపధ్యంలోనే పూజ సాలరీకి గురించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.