ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌‌ సుజాత భర్త ఆత్మహత్య

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌‌ సుజాత భర్త ఆత్మహత్య
  • బిల్డింగ్‌పై నుంచి దూకిన అజయ్‌
  •  ఏసీబీ వేధింపులే కారణం అని ఆరోపించిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌: ఏసీబీ అధికారులకు చిక్కిన షేక్‌పేట్‌ తహసీల్దార్‌‌ సుజాత భర్త అజయ్‌కుమార్‌‌ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడపల్లిలోని తన సోదరి ఇంట్లో ఉదయం 7 గంటలకు ఐదు అంతస్తుల బిల్దింగ్‌ పై నుంచి దూకటంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అజయ్‌ ఉస్మానియా యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.ఆయన భార్య చింతల సుజాత షేక్‌పేట్‌ ఎమ్మార్వో. అయితే ఇటీవల లంచం తీసుకుంటూ సుజాత ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు అజయ్‌ను కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన 30 లక్షల పై అజయ్ విచారించిన ఏసీబీ అధికారులు ఆయన్ను వేధించారనే ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.