
సౌతాంప్టన్: వరల్డ్ కప్ -2019లో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. ఈ సీజన్ లో ఆల్ రౌండర్ గా చెలరేగుతున్న షకీబ్(476) ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) లిస్టులో తర్వాతి ప్లేస్ లో ఉన్నారు. స్టార్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బంగ్లాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు. మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న షకీబ్ వరల్డ్‌కప్ చరిత్రలో వెయ్యి పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.
బంగ్లాదేశ్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడు షకీబ్ కావడం విశేషం. అఫ్ఘాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో దవ్లాత్ జద్రాన్ వేసిన 21వ ఓవర్ లాస్ట్ బాల్ కి సింగిల్ తీసి రికార్డుకు చేరుకున్నాడు. ఓవరాల్ గా ఈ ల్యాండ్ మార్క్ సాధించిన 19వ ప్లేయర్ షకీబ్. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ చెలరేగిన షకీబ్(51) హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు.
Shakib Al Hasan may have departed to Mujeeb, but he made sure to go past fifty for the fifth time this tournament!#RiseOfTheTigers #BANvAFG | #CWC19 pic.twitter.com/DBi5GEFO0N
— ICC (@ICC) June 24, 2019