
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. గుణశేఖర్ దర్శకత్వంలో పూర్తి మైథలాజికల్ మూవీగా వచ్చిన ‘శాకుంతలం’.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది.
దీంతో.. ఈ సినిమాను చెప్పిన డేట్‌కంటే ముందే, ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కనీసం ఓటీటీలో ఐన తాము అనుకున్న స్థాయికంటే ఎక్కువ రెస్పాన్స్‌ను తెచ్చినందుకు శాకుంతలం టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.