నాసిక్ దగ్గర రైలు ప్రమాదం

నాసిక్ దగ్గర రైలు ప్రమాదం

మహారాష్ట్ర నాసిక్ దగ్గర షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. ట్రైన్ లగేజీ కంపార్ట్ మెంట్ లో మంటలు వచ్చాయి. మంటలు రావాటాన్ని గమనించిన అధికారులు.. లగేజీ కంపార్ట్ మెంట్ బోగీలను రైలు నుంచి  విడగొట్టారు. లగేజీ కంపార్ట్ మెంట్ లో దట్టమైన పొగ కమ్ముకుంది. 

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్రైన్ లో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. షాలిమార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు రావటంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.