V6 News

హాస్టల్ లో వసతులు లేవని పోలీస్ స్టేషన్ కు విద్యార్థులు..క్వాలిటి ఫుడ్ లేదు.. భవనం పెచ్చులూడుతున్నాయి..

హాస్టల్ లో వసతులు లేవని పోలీస్ స్టేషన్ కు  విద్యార్థులు..క్వాలిటి ఫుడ్ లేదు.. భవనం పెచ్చులూడుతున్నాయి..

శామీర్ పేట, వెలుగు: హాస్టల్ లో వసతులు లేకపోవడంతో విద్యార్థులు పోలీస్​స్టేషన్​ను ఆశ్రయించారు. శామీర్​పేటలోని బీసీ బాలుర సంక్షేమ గురుకుల హాస్టల్ స్టూడెంట్స్​గురువారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని, భవనంపై కప్పు పెచ్చులు ఊడుతున్నాయని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, బాత్రూమ్ లకు డోర్లు కూడా లేవని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ కు సమస్యలు చెప్పుకుంటే తమపై దుర్భాషలాడుతున్నారని చెప్పారు. సమస్యలు తెలుసుకున్న పోలీసులు హాస్టల్ ను సందర్శించారు. అనంతరం సంబంధిత అధికారులు కూడా హాస్టల్ ను విజిట్​ చేశారు.