శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో బీభత్సం.. నుజ్జునుజ్జయిన రెండు కార్లు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో బీభత్సం.. నుజ్జునుజ్జయిన రెండు కార్లు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న కారును వెనకాల నుంచి మరోక కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీలు కొడుతూ.. కల్వర్టులోకి దూసుకెళ్లాయి. దీంతో రెండు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి. ప్రమాద సమయంలో రెండు కార్లలో నలుగులు వ్యక్తులు ఉన్నారు. ఆ నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 ALSO READ :- ఊరు పేరు భైరవకోనకి నుంచి హరోం హర సాంగ్.. వింటే గూస్బంప్స్ గ్యారంటీ

 ప్రమాదం ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిపై జరగడంతో.. అటుగా వెళుతున్న ప్రయాణికులు దీన్ని చూసి ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.