
ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్, బంగారం ఎక్కువగా పట్టుబడుతోంది. తాజాగా మరో మారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మాలావి నుండి దోహా మీదుగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతుందని తెలుస్తోంది. వైట్ పౌడర్ క్రీం లో కలిపి బ్రీఫ్ కేస్ లో హెరాయిన్ తరలిస్తున్న మహిళ ప్రయణికురాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో 5 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ హెరాయిన్ విలువ 41 కోట్లు దాకా ఉంటుందని చెబుతున్నారు. దీంతో మహిళను అదుపులోకి తీసుకున్న డి ఆర్ ఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.