ద్వాదశ రాశుల వారి జీవితాలలో ఏదో ఒక సమయంలో శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. శని సంతోషాలను మాత్రమే కాదు కఠినమైన సమయాలను, దుఃఖాలను కూడా ఇచ్చే దేవుడు. అటువంటి శని దేవుడు కొన్ని రాశుల వారి జీవితాలలో ఈ సంవత్సరం కష్టాలను కలిగిస్తున్నాడు. ఇక ఆయా రాశుల వారు జనవరి 31 తేదీన శని త్రయోదశి రోజు కొన్ని పరిహారాలు చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏ రాశి వారు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి. సూర్య పుత్రుడైన శనిదేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఒక్కో రాశిలో 2.5 ఏళ్లు ఉంటూ వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మనుషులు చేసే పనులకు అనుగుణంగా న్యాయం చేస్తుంటాడు. అయితే ఈయనకు కష్టాలను ఇచ్చే వాడు అనే పేరే ఉంది. కానీ న్యాయబద్ధంగా జీవించే వారికి అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే శనిదేవుడి అనుగ్రహం ఉంటే అన్నీ శుభాలు జరుగుతాయని భావిస్తారు. ఎంతో పవర్ ఫుల్ శని దేవుడి అనుగ్రహం కోసం ప్రతి రాశి వారు వారి జాతకం ఆధారంగా శని త్రయోదశి రోజు కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: ఈ రాశి వారిని శని దేవుడు పనిలో ఒత్తిడి కలుగజేస్తాడు. ప్రతి పని కూడా కష్టంగా భారంగా ఉంటుంది. ఈ రాశివారు శని త్రయోదశి రోజు ( జనవరి 31) శివునికి అభిషేకం.. నల్ల నువ్వులు దానం చేస్తే అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి : ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించి.. శని త్రయోదశి రోజున పేదలకు అన్నదానం.. వస్త్రదానం చేయడం వలన ఆదాయం పెరుగుతుంది. .
మిథున రాశి : శని త్రయోదశి రోజున శని దేవుడి దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేయడం వలన ఉద్యోగంలో సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ప్రతి శనివారం నల్ల కుక్కలకు ఆహారం ఇవ్వాలి. పేదలకు బెల్లం.. నువ్వుల ఉండలు పంచి పెట్టాలి.
కర్కాటక రాశి : శని త్రయోదశి రోజున ఈ రాశి వారు శివుడిని పూజించాలి. నల్ల వస్త్రాలను దానం చేయాలి. శివాలయంలో 41 రోజులకు సరిపడ దీపారాధనకు నువ్వుల నూనె ఇవ్వాలి
సింహ రాశి : వ్యాపారంలో ఇబ్బందులు.. వైవాహిక జీవితంలో ఒత్తిడుల నుంచి పరిష్కారం కోసం ఈ రాశి వారు శని త్రయోదశి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. అలాగే శనిదేవుడికి తైలాభిషేకం ( నువ్వులనూనెతో) చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి.
కన్య రాశి : ఈ రాశి వారు శత్రుభయం.. ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం కోసం శనివార నియమాలు పాటించాలి. శని త్రయోదశి రోజు .. శని దేవుడిని పూజించి.. కేజీం పావు నల్ల నువ్వులు.. కేజీం పావు బెల్లం దానం చేయాలి. అలాగే విష్ణు సహస్రనామం చదివినా.. విన్నా.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
తుల రాశి : ఈ రాశి వారికి కెరీర్‌లో ఆటంకాలు తొలగిపోయేందుకు పేదలకు ఆర్థికసాయం చేయాలి. శని త్రయోదశి రోజు వీలైననన్ని ఎక్కువ సార్లు శని మంత్ర జపం చేయాలి. అలాగే పరమేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి.
వృశ్చిక రాశి :ఈ రాశి వారు శని త్రయోదశి రోజున రావిచెట్టు కింద దీపారాధన చేయడం వల కుటుంబంలో కలహాలు.. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. శని దేవుడికి ప్రదక్షిణాలు చేసి ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయాలి.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు శని త్రయోదశి రోజున నల్ల నువ్వులు.. బెల్లం దానం చేయడం వలన శని భగవానుడు సానుకూల ఫలితాలను కలుగజేస్తాడు.
మకర రాశి: ఈ రాశి వారు శని త్రయోదశి రోజున శని స్త్రోత్రాన్ని పఠించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి. అలాగే మహా శివరాత్రి రోజున శివకళ్యాణం చేయించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక వృద్ధి, కష్టానికి తగిన ఫలితం ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పరిష్కారం కోసం శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం, హనుమాన్ చాలీసా పఠించాలి.శని దేవుడిని నల్ల నువ్వులతో అర్చించాలి. ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేయాలి.
మీన రాశి : ఈ రాశి వారు పేదలకు అన్నదానం శివారాధ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి రావి చెట్టు కింద దీపం వెలిగించి.. శని మంత్రాన్ని జపం చేస్తే కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
